పెళ్లి కావడంతో మాంచి మూడ్‌లో ఉన్నాను.. పది రోజులు సెలవు ఇవ్వండి: వైరల్ అవుతున్న కానిస్టేబుల్ లీవ్ లెటర్

  • పది రోజుల సెలవు కావాలంటూ దరఖాస్తు
  • పెళ్లి కావడంతో ఆగలేకపోతున్నానన్న కానిస్టేబుల్
  • దాపరికం లేకుండా వాస్తవ పరిస్థితి వివరణ
కొత్తగా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన కర్ణాటక కానిస్టేబుల్ ఒకరు రాసిన సెలవు దరఖాస్తు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చదివిన వారు రకరకాల కామెంట్లతో నవ్వు తెప్పిస్తున్నారు. కర్ణాటకలోని బేగూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మారుతికి ఇటీవలే వివాహమైంది. పెళ్లికి సెలవులు ఇచ్చినా ఆ తర్వాత భార్యతో సన్నిహితంగా గడిపే సమయమే లేకుండా పోయింది. దీంతో సెలవులకు దరఖాస్తు చేసుకోవాలని భావించిన మారుతి ఎటువంటి దాపరికం లేకుండా వాస్తవాన్ని పేపర్‌పై పెట్టాడు.

తనకు ఇటీవలే వివాహమైందని, భార్యతో కలిసి కొన్ని పూజలు చేయాల్సి ఉందని సెలవు చీటీలో పేర్కొన్నాడు. అలాగే ఊరిలో కూడా కొన్ని పనులు ఉన్నాయని పేర్కొన్న మారుతి.. కొత్తగా పెళ్లి కావడంతో ఆగలేకపోతున్నానని, మాంచి మూడ్‌లో ఉన్నానని పేర్కొన్నాడు. తన పరిస్థితిని అర్థం చేసుకుని ఫిబ్రవరి 24 నుంచి మార్చి ఐదో తేదీ వరకు పది రోజులు సెలవులు మంజూరు చేయాలని కోరుతూ సీఐకి లేఖ రాశాడు. ఈ సెలవు దరఖాస్తు సోషల్ మీడియాకు ఎలా ఎక్కిందో కానీ తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా సెలవులు కావాల్సి వచ్చినప్పుడు ఏదో సాకుచెప్పి, అబద్ధాలు ఆడతారని, కానీ కానిస్టేబుల్ మాత్రం తానున్న పరిస్థితిని నిజాయతీగా వివరించి సెలవు అడిగినందుకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కొందరైతే నవ్వు తెప్పించే కామెంట్లు చేస్తున్నారు. అయితే, మారుతికి సెలవు మంజూరు చేసిందీ, లేనిదీ తెలియరాలేదు.
Go Back to Shorts
Karnataka
Police constable
leave letter
Begur
Maruthi

More Telugu News